Site icon HashtagU Telugu

Kamala Das: ఒడిశా మాజీ మంత్రి కమలా దాస్ మృతి

Kamala Das

Kamala Das

Kamala Das: ఒడిశా మాజీ మంత్రి, మూడుసార్లు భోగ్రాయ్ ఎమ్మెల్యేగా పని చేసిన కమలా దాస్ ఈ రోజు శుక్రవారం కటక్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. రెండు వారాల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కమలా దాస్‌ను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమెను కటక్‌లోని ఆస్పత్రికి తరలించారు.

కమలా దాస్ తొలిసారిగా 1990లో బాలాసోర్ జిల్లాలోని భోగ్రాయ్ స్థానం నుంచి జనతాదళ్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1995లో తిరిగి ఎన్నికయ్యారు, ఆపై 2000లో మళ్లీ బిజెడి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆమె బిజూ పట్నాయక్ మరియు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలలో మాంత్రిగా పనిచేశారు. విద్య మరియు యువజన సేవలు, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మరియు స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖలను నిర్వహించారు. కమల దాస్‌ను 2001లో మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లోకి మారారు. ఆమె 2014లో బీజేడీకి తిరిగి వచ్చారు. కమలా దాస్ మరణంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆమె అందించిన సేవలని కొనియాడుతూ సంతాపం తెలిపారు.

We’re now on WhatsAppClick to Join

కమలా దాస్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధించారు. కుటుంబ సబ్యులకు ధైర్యాన్నివ్వాలి భగవంతుడిని కోరారు.

Also Read: Sisodia: మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సిసోడియా