Site icon HashtagU Telugu

Andhra Pradesh : న‌ర్సీప‌ట్నంలో ఉద్రిక్త‌త‌.. మాజీ మంత్రి అయ‌న్న‌, ఆయ‌న కుమారుడు అరెస్ట్‌

Ayyana Imresizer

Ayyana Imresizer

అన‌కాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు, ఆయ‌న చిన్న కుమారుడు చింత‌కాయ‌ల రాజేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ 50ఏ ప్రకారం సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి అయ్యన్నపాత్రుడు, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అరెస్టు చేశారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లుగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడు, కుమారుడు రాజేష్‌ను ఏలూరు కోర్టులో వీరిద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.