Site icon HashtagU Telugu

Kumaraswamy : హాస్పటల్ లో చేరిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి

Ex Karnataka CM HD Kumaraswamy admitted to hospital at Bengaluru

Ex Karnataka CM HD Kumaraswamy admitted to hospital at Bengaluru

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి (Former CM H D Kumaraswamy) అస్వస్థతతో అపోలో (Apollo) హాస్పటల్ లో చేరారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం (Fever)తో బాధపడుతున్న కుమారస్వామి..బుధువారం ఉదయం జ్వరం మరింత ఎక్కువ కావడం తో బెంగళూరులోని అపోలో ప్రైవేటు హాస్పటల్ లో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం డాక్టర్స్ (Doctors ) కుమారస్వామికి చికిత్స అందజేస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పటల్ వర్గాలు తెలిపాయి.

Read Also : Patnam Mahender Reddy: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం, తొలి ఫైల్ పై సంతకం

కుమారస్వామి గత వారం రోజులుగా వరుస కార్యక్రమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. వాస్తవానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ షెడ్యూల్ రద్దు చేసుకున్నారు. ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్‌ కూడా చేసుకున్నారు. ఈ తరుణంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి పార్టీ వర్గాలు, అభిమానులు , పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు.

Exit mobile version