Ex-IPS Officer : తెలంగాణ బీజేపీలో చేర‌నున్న మాజీ ఐపీఎస్ అధికారి..?

మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్ త్వ‌ర‌లో బీజేపీలో చేరనున్నట్లు స‌మాచారం. ఆయ‌న బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారని,

  • Written By:
  • Publish Date - July 29, 2022 / 02:10 PM IST

మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్ త్వ‌ర‌లో బీజేపీలో చేరనున్నట్లు స‌మాచారం. ఆయ‌న బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారని, త్వరలో కాషాయ పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 2020లో DGP ర్యాంక్‌లో పదవీ విరమణ చేసిన కృష్ణ‌ప్రసాద్ 1987-బ్యాచ్ IPS అధికారి. ఆయ‌న ప్రస్తుతం సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆనందాన్ని కలిగించే లక్ష్యంతో ఒక NGOని నడుపుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో ప్రసాద్ పార్టీలో చేరే అవకాశం ఉంది. చర్చలు కొనసాగుతున్నాయని, జాతీయ స్థాయిలో ఆయ‌న‌ చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నట్లు మాజీ పోలీసు అధికారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని తాను దృఢంగా నమ్ముతున్నానని, సాధారణ సమయాల కంటే కోవిడ్-19 మహమ్మారి కాలంలో దేశం పనితీరు మెరుగ్గా ఉందని రుజువైందని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ అనేక మంది మాజీ బ్యూరోక్రాట్లను విజయవంతంగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఎక్సైజ్‌ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన ఆర్‌ చంద్రవదన్‌ పార్టీలో చేరారు. అదేవిధంగా, క‌ర్ణాట‌క మాజీ సీఎస్ రత్న ప్రభ బిజెపిలో చేరారు. ఆమె తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే పార్టీలో ఉన్నారు.