Site icon HashtagU Telugu

Covid_19: కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా.. దరఖాస్తులు ఇలా!

Covid Tests

Covid Tests

కరోనా మహమ్మారి ధాటికి యువకులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది బలయ్యారు. ఎంతోమంది అనాథలయ్యారు. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కరోనా కారణంగా కనుమూసిన కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సైతం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో Covid19 కారణంగా మరణించిన మృతుల బంధువులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సంబంధిత వ్యక్తులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ గ్రేషియా నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింది వివరాలను గమనించండి.