Site icon HashtagU Telugu

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చేసుకోవాలని, హోంఐసోలేషన్ లోకి వెళ్లాలి’’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ ఇటీవలే కొత్త IPL ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ కి మెంటార్‌గా ఎంపికయ్యాడు. దాని కోసం అతను రోజువారీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు.