Wipro: శాలరీ తక్కువ అయినా సరే.. ఉద్యోగంలో చేరుతాం.. విప్రోలో వింత పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆర్ధిక అనిశ్చితి బాగా నెలకొంది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలతో చాలా కంపెనీలను ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి.

  • Written By:
  • Updated On - April 30, 2023 / 11:13 PM IST

Wipro: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆర్ధిక అనిశ్చితి బాగా నెలకొంది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలతో చాలా కంపెనీలను ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి కంపెనీలన్నీ ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నాయి. అందులో భాగంగా విప్రో కూడా చాలామంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫ్రెషర్స్‌ని కూడా చాలామంది కంపెనీ తీసుకోవడం లేదు. రిక్రూట్‌మెంట్‌ను బాగా తగ్గించేశాయి. విప్రో కూడా ప్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గించింది. ప్రెషర్స్ ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. అయితే కొద్దిరోజులకే దానిని సవరిస్తూ జీతాల్లో భారీ కోత విధించారు. ప్రెషర్స్ ఇచ్చే వేతనాల్లో భారీగా కోత విధించింది.

తాము ఎవరినీ చేరాలని బలవంతం పెట్టడం లేదని, తాము అందించే వేతనం కావాలనుకుంట చేరవచ్చని విప్రో వర్గాలు తెలిపాయి. జీతాలు తక్కువ అయినా సరే చాలామంది ఉద్యోగులు విప్రోలో చేరుతున్నారు. దాదాపు 92 శాతం మంది ప్రెషర్లు తాము అందించే వేతనంకు ఉద్యోగం చేరుతున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. అయితే రానున్న రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ప్రెషర్స్ ని ఏడాది పొడవువనా సంబంధిత ప్రాజెక్ట్ లో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

విప్రో ప్రెషర్స్ ప్యాకేజీని రూ.3.5 లక్షలకు కుదించింది. మార్చిలో రూ.6.5 లక్షలుగా వేతనాన్ని నిర్ణయించింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ప్రెషర్స్ కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేసింది. కానీ ఆ తర్వాత కుదించడంతో ప్రెషర్స్ నిరాశ చెందుతున్నారు.విప్రో నిర్ణయంపై చాలామంది మండిపడుతున్నారు.