Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితాలపై మోడీని టార్గెట్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ 120 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాలతో కొనసాగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Karnataka Election Results 2023

Karnataka Election Results 2023

Karnataka Election Results 2023: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ 120 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాలతో కొనసాగుతుంది. ప్రస్తుతానికి కర్ణాటక కుర్చీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉంది ఆ పార్టీ. ఒకవేళ అక్కడ హంగ్ ఏర్పడితే జేడీఎస్ పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.

కర్ణాటక (Karnataka Results 2023) ఫలితాలపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దేశంలో కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా బీజేపీపై మండిపడ్డారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది బీజేపీపై మండిపడ్డారు. ప్రియాంక శనివారం ట్విట్టర్ వేదికగా బీజేపీని టార్గెట్ చేసింది. ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రకారం బజరంగ్‌ బలీ కీ జై, బీజేపీ ఓటమి ఖాయమని’ ప్రియాంక ట్వీట్‌ లో పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో ప్రధాని మోదీ ప్రచారాన్ని బజరంగ్ బలి కూడా తిరస్కరించిందని ప్రియాంక అన్నారు. ఇది ప్రధాని మోదీ ఓటమి అంటూ విమర్శించారు.

Read More: Karnataka Election Results 2023: కర్ణాటక రిజల్ట్స్ ప్రధాని సీటుపై ప్రభావం? కోట్ల రూపాయల బెట్టింగులు

  Last Updated: 13 May 2023, 12:55 PM IST