Ukraine Russia War: ఐరోపా కంట్రీస్ జ‌స్ట్ మిస్..?

ఉక్రెయిన్, రష్యా మ‌ధ్య మొద‌లైన యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్ర‌మంలోఈరోజు ఎనర్హోదర్ నగరంలోని ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్‌ను అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్బంగా ప్లాంట్ వద్ద మంటలు వ్యాపించడంతో కొంత ఆందోళన వ్యక్తమయినా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే దీని వల్ల న్యూక్లియర్ రేడియేషన్ పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక జపోరిజ్జియా […]

Published By: HashtagU Telugu Desk
Zaporizhzhia Nuclear Power Plant

Zaporizhzhia Nuclear Power Plant

ఉక్రెయిన్, రష్యా మ‌ధ్య మొద‌లైన యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్ర‌మంలోఈరోజు ఎనర్హోదర్ నగరంలోని ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్‌ను అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్బంగా ప్లాంట్ వద్ద మంటలు వ్యాపించడంతో కొంత ఆందోళన వ్యక్తమయినా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే దీని వల్ల న్యూక్లియర్ రేడియేషన్ పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక జపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ పై దాడులు ఇలాగే కొన‌సాగితే పెను విధ్వంసం తప్పదని నిఫుణులు కూడా హెచ్చ‌రించారు. అయితే ఆ ప్రాంతానికి ఆర్మీ ద‌ళాలు స‌హాయ‌క సిబ్బంది, అగ్ని మాప‌క కేంద్రాల‌ను అనుమ‌తించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిందంటున్నారు. న్యూక్లియర్ ప్లాంట్ ద‌గ్గ‌ర మంటలు చెలరేగుతోన్న ప్రాంతానికి వెంట‌నే చేరుకున్న అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక దళాలు మంట‌ల‌ను ఆర్పేశార‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ఈ మంట‌లు ఇలాగే కొన‌సాగితే మొత్తం ఐరోపాపై తీవ్ర ప్ర‌భావం చూపేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు ఐరోపా కంట్రీస్ జ‌స్ట్ మిస్ అయ్యాయ‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు.

  Last Updated: 04 Mar 2022, 04:48 PM IST