Site icon HashtagU Telugu

Etela Rajender: కాంగ్రెస్‌లోకి ఈటెల… జూన్ లో ముహూర్తం?

Etela Rajender

New Web Story Copy 2023 05 30t151916.757

Etela Rajender: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణా రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) నుంచి బయటకొచ్చిన ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో బైఎలెక్షన్స్ లో భారీ మెజారీటీతో గెలుపొందారు. అనంతరం ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈటెలతో బీజేపీ పుంజుకుంటుంది అనుకున్నారందరు. కానీ ఆయనకు బీజీపీలో సముఖత స్థానం కల్పించలేదు. అయితే మొన్నటివరకు బండిని దించేసి ఈటెలకు పగ్గాలు అప్పజెప్పాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్టు స్పష్టమైంది.

Read More: Amit Shah Meets Etela: ఈటల ఇంటికి అమిత్ షా.. కీలక అంశాలపై చర్చ!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగడం కన్ఫర్మ్ అయిన తరువాత ఈటెల అంశం తెరపైకి వచ్చింది. ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారనే సంకేతాలు వినిపించాయి. ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ రేవంత్ కేంద్ర పెద్దలతో చర్చలు జరపడం, రాహుల్, ప్రియాంక గాంధీలతో బహిరంగ సమావేశాలు నిర్వహించడం ద్వారా తెలంగాణాలో రేవంత్ చరిష్మా బాగా పెరిగింది. మరోవైపు తెలంగాణ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఇంకా అలానే ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ లో మరో వారం , పదిరోజుల్లో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తుంది. కెసిఆర్ ను గద్దె దించేందుకు విపక్షాల నేతలు ఎత్తుగడలలో భాగంగా మరో పది రోజుల్లో పేరు మోసిన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన జూపల్లి కృష్ణారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో పొంగులేటి, జూపల్లి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… ఈటెల రాజేందర్ కూడా మాతోనే వస్తారని, వచ్చే వారం పది రోజులలో మాతో ఇంకెవరు వస్తారనేది మీరే చూస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. జూన్ మొదటి వారంలోగా సస్పెన్స్ కు తెరపడుతుందంటూ జూపల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

Read More: Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు

Exit mobile version