Site icon HashtagU Telugu

Telangana :అసెంబ్లీ లో హరీష్ , కేటిఆర్ దాడి పూర్తి అయ్యింది..ఇక మిగిలింది కేసీఆర్ దాడే – ఈటెల

Etela Rajender Fires On Kcr Government

Etela Rajender Fires On Kcr Government

బిజెపి నేత , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajender) మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని , ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారు. రేపు సీఎం కేసీఆర్ దాడి చేస్తారు..అని ఈటెల అన్నారు. ఆర్టీసీ విలీన ప్రకటన ఫై ఇప్పుడు పెద్ద రగడ నడుస్తుంది. ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా..ఆ బిల్లును అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలంటే దానికి ..గవర్నర్ ఆమోదం ఉండాలి. కాకపోతే ఈ విలీన ప్రక్రియ లో కొన్ని అంశాల ఫై ప్రభుత్వం తో చర్చించాల్సి ఉందని , ఆ చర్చల తర్వాత బిల్లు ఫై సంతకం పెడతానని గవర్నర్ తెలిపారు. అయితే ప్రభుత్వం , ఆర్టీసీ కార్మికులు మాత్రం బిల్లు ఫై సంతకం పెట్టాలని ఈరోజు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

దీనిపై ఈటెల స్పందిస్తూ..రాష్ట్రం (Telangana)లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్ఎంలు ఇలా అనేకమంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారి సమస్యలు నేతలకు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదు. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండరు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలి. అయినా మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారు. రేపు సీఎం కేసీఆర్ దాడి చేస్తారు అని ఈటెల అన్నారు.

‘ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని (TSRTC Merger Bill) మేం స్వాగతిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయి పడ్డారు. ఆర్టీసీలో పనిచేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. గవర్నర్ కు ఆర్టీసీ బిల్లును మొన్ననే పంపారు. బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలి. ఇదంతా వదిలేసి అందుబాటులో లేరని చెబుతున్నారు. ఈ విషయంలో గవర్నర్ (Telangana Governor) ఫై బట్టకాల్చి మీదేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు తీసుకువస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని ఈటల చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం గవర్నర్..ఆర్టీసీ యూనియన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నట్లు సమాచారం. విలీన అంశంలో పలు ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది. వాటిని తెలియజేయగానే సంతకం పెడతానని చెప్పినట్లు తెలుస్తుంది. మరికాసేపట్లో గవర్నర్ ఏమన్నదీ అనేది పూర్తి గా తెలుస్తుంది.