వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవటం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒకసారి టీఆరెస్ ఓడితే…మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు మాత్రమే కేసీఆర్ మీడియా ముందుకు వస్తారని ఆరోపించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే అహం బాగా పెరిగిందని మండిపడ్డారు. తెలంగాణ సంపదకు ప్రజలు యజమానులు..కేసీఆర్ కాదన్నారు. 20ఏండ్లుగా కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉందని…హుజురాబాద్ ఎన్నికల్లో 6వందల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖ్చు చేశావని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తే…వారిమీద లేని ప్రేమ పంజాబ్ రైతుల మీద ఎందుకని ప్రశ్నించారు. ఎవరబ్బ సొమ్మని 250కోట్లు ఖర్చు దేశంలో ప్రకటనలు ఇచ్చావో చెప్పాలన్నారు. ఏడాదికి 40వేల కోట్ల రూపాయలు లిక్కర్ పై ఆదాయం ఉందని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం టీఆరెస్ అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్లు, సీఎస్ మద్యంను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వీటిపై సమీక్షలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో 6 లక్షల 80వేల మంది మద్యానికి బానిసలైన కుటుంబాలు ఉన్నాయన్నారు. పెరుగుతున్న పబ్ కల్చర్ ను బీజేపీ రూపుమాపుతుందని…ఫ్యూడల్ రాజకీయ మనసత్త్వం ఉన్న వ్యక్తి కేటీఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజానాడి తెలిసిన ప్రజానేతకు పీకే అవసరం ఎందుకు వచ్చిందని…కేసీఆర్ కు పోయేకాలం వచ్చినందుకేనన్నారు టీఆరెస్ రాష్ట్రంలో ఆరిపోయే దీపం లాంటిందని ఈటెల ధ్వజమెత్తారు.