Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవనంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ఆయనపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిపేందుకు సిద్ధమైంది. విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, ప్రాజెక్టు అక్రమాల కేసును రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Japan : జపాన్ కంపెనీ ప్రయోగించిన మూన్ మిషన్ విఫలం
“కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వాన్ని నిర్ణయించిన బడ్జెట్‌కు మాత్రమే నిధులు కేటాయించడం నా బాధ్యత. దాని తర్వాత జరిగే నిర్వాహక చర్యలతో నేను సంబంధం లేదని” స్పష్టం చేశారు ఈటల. తనపై చేపడుతున్న చర్యలన్నీ కక్ష సాధింపుదేనని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు.
Akhil Wedding : అట్టహాసంగా అఖిల్ పెళ్లి వేడుక..అతిధులు ఎవరెవరు వచ్చారంటే !!