Site icon HashtagU Telugu

Seethakka: రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు: మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Seethakka: మహిళశక్తి క్యాంటీన్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో రెండుక్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మతిచేతివంటలా నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళ సంఘాలని మంత్రి సీతక్క కోరారు. రెండేళ్లలో జిల్లాకు ఐదుచొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళ సంఘాలకు ఆ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద…. మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటుచేయనున్నారు.

క్యాంటీన్లు నిర్వహించే మహిళలకి జాతీయ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు. రెండుమోడళల్లో ఏర్పాటు చేసే మహిళ శక్తి క్యాంటీన్ ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువఅద్దెతోకేటాయించి ఒప్పందం చేసుకుంటారని సీతక్క వివరించారు. సుమారు 15 లక్షలతో ఒక మోడల్.. 25 లక్షల పెట్టుబడితో మరో మోడల్ ఏర్పాటుచేయనున్నారు. బెంగాల్ లో దీదీ కీ రసోయ్ నిర్వహణను అధ్యయనం చేసి సెర్ప్ అధికారుల బృందం సూచన మేరకు రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు,