Site icon HashtagU Telugu

Bhatti: భట్టికి జరిగిన అవమానంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం

Errolla Srinivas

Errolla Srinivas

Bhatti: యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం.

అణగారిన వర్గాలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని, కాంగ్రెస్ కు దళితులపై ఎలాంటి ప్రేమలేదని తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారికే జరిగిన ఈ ఘోర అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించాలి. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులను అరెస్ట్ చేయాలి.