Site icon HashtagU Telugu

Errabelli Dayakar Rao: ఓయూలో ఎర్రబెల్లి బర్త్ డే వేడుకలు, మొక్కలు నాటిన బీఆర్ఎస్వీ నేతలు!

Brsv

Brsv

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేల్పుకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. బిఆర్ఎస్వి, ఓయూ జే ఏ సి నాయకులతో కలిసి కేకు కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎర్రబెల్లి ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మంత్రిగా వరంగల్ జిల్లా ప్రజల అభివ్రుద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నారని వేల్పుకొండ వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రావు, ప్రధాన కార్యదర్శులు శిగా వెంకటేష్ గౌడ్, ఎర్రవాండ్ల కృష్ణ, తోనుపునురి శ్రీకాంత్ గౌడ్, కటం శివ, నక్క శ్రీశైలం యాదవ్, అందే రవి, నాగేందర్ రావు, రాజు యాదవ్, శ్రీనివాస రెడ్డి, చారి, సుధాకర్,తీగల సందీప్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: BRS Minister: గిరిపుత్రులకు గుడ్ న్యూస్, పోడు లబ్ధిదారులకూ రైతుబంధు!

Exit mobile version