Site icon HashtagU Telugu

Covid:వరిరైతుల కోసం ఢిల్లీలో గడిపిన తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ రాగానే అయన హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

వరిధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు దాదాపు వారం రోజులు డిల్లీలో పర్యటించిన ఎర్రబెల్లి హైదరాబాద్ చేరుకోగానే కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు.

వారం రోజులుగా తనని కలిసినవారు, సన్నిహితంగా తిరిగిన వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలనిఎర్రబెల్లి సూచించారు. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి తన వద్దకు రావద్దని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇటు హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీఏ లు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి గతవారం మొత్తం ఢిల్లీలో మిగతా మంత్రులతోనే గడిపారు. ఇక మిగతా మంత్రుల పరిస్థితి ఏంటో చూడాలి.