సంతకం ఫోర్జరీ చేయడం కామన్..కానీ మంత్రి సంతకమే ఫోర్జరీ (Errabelli Dayakar Rao Signature Forged) చేసి వార్తల్లో నిలిచారు సంగారెడ్డి జిల్లా వాసులు. తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులు కేటాయించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు రీసెంట్ గా పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు అందాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్సు లేఖలు రాకపోవడం తో అనుమానం వచ్చి.. అధికారులు ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి కార్యాయలం దృష్టికి తీసుకువెళ్లారు. సిఫార్సు లేఖలపై ఆరా తీయగా.. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ వీటిని తయారు చేసినట్లు గుర్తించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు లేఖలను పంపించినట్లు విచారణ లో తేలింది. ఈ మేరకు మంత్రి ఓఎస్‌డీ డా.రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు గౌస్‌పాషా, గుంటి శేఖర్‌పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Also : MLC Kavitha: సామాజిక సేవలో ఎమ్మెల్సీ కవిత కుమారులు