Errabelli: సీఎం కెసిఆర్, BRS పార్టీయే ప్రజలకు శ్రీరామ రక్ష- మంత్రి ఎర్రబెల్లి

  • Written By:
  • Updated On - August 1, 2023 / 11:25 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలతో నష్టపోయిన జిల్లాల బాధితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి విలయానికి నష్టపోయిన ప్రజల పట్ల ప్రభుత్వం, సీఎం కెసిఆర్ మానవీయంగా వ్యవహరించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గొప్ప నిర్ణయమని మంత్రి అన్నారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారన్నారు.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములను సేకరించాలని సీఎం కేసిఆర్ గారి నేతృత్వంలో క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాకు హార్టికల్చర్ కాలేజీ మంజూరు, ములుగు జిల్లా తాడ్వాయి కి 25 పోస్టులను మంజూరు చేసిన సీఎం కెసిఆర్ గారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి, రాబోవు కాలంలో దేశానికి సీఎం కెసిఆర్ గారు, BRS పార్టీయే శ్రీరామ రక్ష అని అన్నారు రాష్ట్రంలో సీఎం కెసిఆర్ చేస్తున్న ప్రజాసంక్షేమం ను చూసి దేశంలో కూడా BRS పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.