Site icon HashtagU Telugu

Errabelli: ఆటా మహాసభలకు ఎర్రబెల్లి

123

123

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా మంత్రి ఎర్ర‌బెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్ర‌సంగిస్తారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు వేల్పుకొండ వెంకటేష్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలుసుకొని బొకే అందించి, అభినందనలు తెలిపారు. ఆటా మహాసభల్లో ఎర్రబెల్లి పాల్గొనడం ఆనందిచగ్గ విషయమన్నారు. ఆయన అమెరికా పర్యటన హ్యాపీగా సాగాలని వెంకటేశ్ ఆకాక్షించారు.

Exit mobile version