Site icon HashtagU Telugu

Hyderabad: పర్యావరణ విధ్వంసం అపడానికి నూతన ఆవిష్కరణలు అవసరం : మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao Babu

Tummala Nageswara Rao Babu

Hyderabad: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ శివారులో బయోటక్ అగ్రి ఇన్నోవేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు.  వ్యవసాయానికి దోహదపడేటునంటి ఏటీజీసీ సంస్థ ఏ రకమైన చెడు లేని పంటలకు హాని లేని మందులను తయారు చేస్తున్నామని రాంచంద్రా రెడ్డి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకట్ రెడ్డి అని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తాను కూడా వ్యవసాయం చేస్తున్నానని నీను చేసే వ్యవసాయంలో ఎలాంటి యూరియా వేయనని చెప్పారు.

వ్యవసాయ దేశమైన మన దేశంలో వ్యవసాయాన్ని కాపాడుకొని ప్రపంచ దేశాల్లో అన్నేక దేశాల్లో తినడానికి తిండి లేని రోజల్లో అత్యదిక జనాభ కలిగిన మన దేశంలో వ్యవసాయం భాగా అభివృద్ది చెందిందన్నారు. దేశాన్ని గడగడలాడించినటువంటి కరోనా టైంలో అన్ని పనులు ఆగాయిగాని రైతుల పనిమాత్రం ఆగలేదన్నారు. అనంతరం ప్రొఫీసర్ రాంచంద్రారెడ్డి, ఏటీజీసీ బయోటెక్ సీఈఓ వీబీ.రెడ్డి వ్యవసాాయం ద్వారా వచ్చే క్రిమిసంహార మందుల ద్వారా వచ్చే వాతావరణ మార్పులు, పర్యావరణ విద్వంసం లాంటివి ఆపడానికి నూతన ఆవిష్కరణలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నామని తెలిపారు.