Insta Reels: ఇన్‌స్టాగ్రామ్ పిచ్చిలో అత్యుత్సాహం.. పోలీస్ వాహనంపై డ్యాన్సులు..!

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి చాలామంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర, విచిత్ర వేషాలు వేస్తున్నారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 05 21 At 20.41.40

Whatsapp Image 2023 05 21 At 20.41.40

Insta Reels: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి చాలామంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర, విచిత్ర వేషాలు వేస్తున్నారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరికొంతమంది రీల్స్ కోసం ఎక్కడబడితే అక్కడ వీడియోలు చేస్తూ చిక్కులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసి ఓ వ్యక్తి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం పోలీస్ జీప్‌పై డ్యాన్స్ వేశాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు రీల్స్ పిచ్చితో పోలీస్ వెహికల్ ఎక్కి డ్యాన్స్ వేశారు. దీంతో ఈ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇద్దరి యువకులపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ వీడియోలో పోలీస్ జీప్ బానెట్ పై కూర్చోని పోలీస్ జీప్ ముందు పోర్షన్ ఎక్కువతూ కాళ్లను అడ్డంగా పెట్టారు. కెమెరా లెన్స్ లకు ఇద్దరు పోజులు ఇచ్చారు.

కాన్పూర్‌లోని బజారియా ప్రాంతంలో ఈ వీడియోను రికార్డ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. కింగ్ అనే క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో యువకులు పోస్ట్ చేశారు. రీల్స్ లో ఉన్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు నిందితుడి సోదరుగా తెలుస్తోండగా.. రెండో వ్యక్తి ఎవరనేది పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. అయితే పోలీస్ వెహికల్ ను రీపేరింగ్ కోసం గ్యారేజ్ కు పంపించారు. అక్కడ యువకులు రీల్స్ షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ పోలీస్ వెహికల్ కాన్పూర్ లోని దేహత్ లోని అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ పేరిట రిజిస్టర్ అయిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరి యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

  Last Updated: 21 May 2023, 08:42 PM IST