TS : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ…!!

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ...సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

  • Written By:
  • Updated On - June 12, 2022 / 07:39 PM IST

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ…సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది పిల్లలకు మంత్రి స్వాగతం పలకనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న పాఠశాలలో రేపు పిల్లలకు స్వాగతం పలకాలని కోరారు. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు.

వేసవి సెలవులు పొడిగింపు లేదని స్పష్టంచేశారు సబితా ఇంద్రారెడ్డి. అయితే ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందనన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సీటీ ఆధ్వర్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని వెల్లడించారు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.