World Cup 2023: న్యూజిలాండ్ లక్ష్యం 283, రాణించిన రూట్

ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ మధ్య ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.

World Cup 2023: ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ మధ్య ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తరఫున జో రూట్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. 77 పరుగుల వద్ద రూట్ ఔటయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 43 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మాట్ హెన్రీ మూడు వికెట్లు తీయగా, సాంట్నర్, ఫిలిప్స్ చెరో 2 వికెట్లు తీశారు.

న్యూజిలాండ్ గెలవాలంటే 283 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరియు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ జట్టుకు దూరమయ్యారు. ఇక తుంటి గాయంతో బాధపడుతున్న వెటరన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 – డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ మరియు ట్రెంట్ బౌల్ట్.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 – జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.

Also Read: Telangana Pre Poll Survey 2023 : కారు స్పీడ్ కు బ్రేకులు..కాంగ్రెస్ జోరు..దరిదాపుల్లో లేని బిజెపి