Site icon HashtagU Telugu

Encroachment: ‘సంతానం’ ఇచ్చే దేవుడు..!

Godralikonda Thirumalanatha Swami Temple

Godralikonda Thirumalanatha Swami Temple

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరూ తమ కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా స్వామివారిని భావిస్తుంటారు అనేక శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి అనంతరం అక్కడ వెలసిన తిరుమల స్వామి ఆ దేవాలయంలో ఉసిరిక చెట్టుకు మొక్కులు కడతారు. స్వామివారిని ప్రార్ధించి భక్తిప్రపత్తులతో ఉండే భక్తులు అనేక వేల మంది సంతాన భాగ్యం పొందారు.

ఇదే విషయాన్ని స్థానికులు భారతీయ జనతాపార్టీ దృష్టికి తీసుకు వెళ్ళారు. దేవాలయం గిరి ప్రదక్షిణ చేసే ప్రదేశంలో ఈ మధ్య కాలంలో హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు చేరారు. గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలు అక్రమంగా ఏర్పాటు చేసి చర్చి నిర్మాణం చేస్తున్నారు. ఈ చర్య ఆ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తోపాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది.
భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నాయకత్వంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమంగా ఏర్పాటు చేసిన చర్చి తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు అండగా ఉన్నాడు.

చర్చి నిర్మాణ ప్రయత్నాన్ని ఆపి ఈ ప్రాంతంలో హిందువుల మనోభావాలు కాపాడడం కోసం ప్రయత్నం జరుగుతోంది. మతోన్మాదుల చర్యలను కట్టడి చేయాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ మనోభావాలు దెబ్బతీసే గొడ్రాలికొండ దగ్గర వ ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు స్థానిక బిజెపి నాయకులు దశల వారీ పోరాటం చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీసోమువీర్రాజు సూచించారు. మొత్తం మీద సంతానం ఇచ్చే కొండను చర్చి ప్రాంతంగా మర్చడాన్ని హిందువులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.