Site icon HashtagU Telugu

#Toll Gates:జనం పల్లెబాట.. నిర్మానుష్యంగా టోల్ గేట్స్

toll gates

toll gates

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌నం ప‌ల్లెబాట ప‌ట్టారు. హైద‌రాబాద్ లో నివసిస్తున్న ఏపీ ప్ర‌జ‌లు పండుగ సెల‌వుల‌కు సొంతూళ్ల‌కు వెళ్లారు గ‌త నాలుగురోజులుగా జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ గేట్లు అన్ని ర‌ద్దీతో ఉండ‌గా ఈ రోజు అవి నిర్మానుష్యంగా మారాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో కేసర టోల్ గేట్ వ‌ద్ద వాహ‌నాలు లేక‌ ఖాళీగా దర్శనమిస్తుంది. ప్ర‌స్తుతం జాతీయ ర‌హ‌దారిపై త‌క్కువ సంఖ్య‌లో వాహ‌నాల రాక‌పోక‌లు జ‌రుగుతున్నాయి. దీంతో టోల్ గేట్ వ‌ద్ద వాహ‌నాలు క్షణం ఆగకుండా వెళ్లిపోతున్నాయి. అయితే వరుసగా ఐదు రోజులు సెలవులు కావడంతో తెలంగాణ నుండి ఆంధ్ర కి వచ్చే వాహనాల సంఖ్య అధికంగా ఉండి ట్రాఫిక్ జామ్ వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వ‌స్తుంద‌ని ప్ర‌యాణికులు అనుకున్నారు.. కానీ అదేమీ లేకుండా 8 ఫాస్ట్ ట్రాక్ ల ద్వారా వాహనాలను త్వరితగతిన వారి వారి గమ్యస్థానాలకు పంపి చేస్తున్నారు