Site icon HashtagU Telugu

జోన‌ల్ వ్య‌వ‌స్ధ ప్ర‌కార‌మే ఉద్యోగుల విభ‌జ‌న‌- కేసీఆర్‌

నూతన జోన ల్ వ్యవస్త నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు.వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు.
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) వోకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని, సిఎం తెలిపారు.

Exit mobile version