Site icon HashtagU Telugu

Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై డేరింగ్ లేడీ.. ఎందుకో తెలుసా!

Burj

Burj

ప్రపంచంలో అతి ఎత్తైన బిల్డింగ్ ఏదైనా ఉందంటే.. మొదటగా గుర్తుకువచ్చేది దుబాయ్ లోనే బుర్జ్ ఖలీఫానే.. అందుకే ఈ మధ్య వరుసగా రికార్డుల్లోకి ఎక్కుతోంది. గతంలో తెలంగాణ బతుకమ్మ పాటకు వేదిక ఈ బిల్డింగ్ తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంజరిగిదంటే..

భూమి నుంచి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవంతి ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అన్న సంగతి తెలిసిందే . ఆ బిల్డింగ్ శిఖరాగ్రంపై నిలబడి , చెప్పదల్చుకున్న విషయాన్ని ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది . గత ఏడాది ప్రకటనలో ఆమె ఒక్కతే భవంతిపై కనిపించగా , ఈసారి భారీ ఏ 380 విమానం కూడా ఆమెకు కంపెనీ ఇచ్చింది . నికోల్ బుర్జ్ ఖలీఫాపై నిలబడి ఉండగా , ఆమె చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది . 59 సెకన్ల నిడివి గల ఈ యాడ్ వీడియో వైరల్ అయ్యింది. యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ గత వారం విడుదల చేసిన యాడ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. వావ్ సో గ్రేట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Exit mobile version