Site icon HashtagU Telugu

Kangana Transforms Indira Gandhi: ఇందిరాగాంధీగా కంగనా.. ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్!

Kangana

Kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటేనే వైవిధ్యమైన చిత్రాలకు పెట్టింది పేరు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించి విమర్శకుల ప్రశసందుకుంది. తాజాగా ఈ బ్యూటీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ లో నటిస్తోంది. ఇందిరాగాంధీ ఆహార్యం, వస్రధారణ ఎలా ఉంటుందో, కంగనా కూడా ఆ రూపంలో ఒదిగిపోయింది. ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన  కంగనా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ మూవీ మొదటి టీజర్‌ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తుంది. చిన్న ప్రోమో వీడియోలో.. కంగనా కళ్లజోడుతో, కాటన్ చీరతో ధరించి ఇందిరాగాంధీని రూపాన్ని అచ్చుగుద్దినట్టుగా దించేసింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యయంగా పిలువబడే ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ చిత్రంలో చూడొచ్చు. కంగనాకు అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ నుండి కాల్ వస్తుంది. ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆమెను సార్ అని పిలుస్తారు. ‘మేడమ్’ అని సంబోధించగలరా కంగనా బదులిస్తుంది. కంగనా ఇందిర గాంధీ రూపంలో చక్కగా ఒదిగిపోవడంతో  ఈ సినిమా టీజర్ ఆసక్తి రేపుతోంది.