Site icon HashtagU Telugu

Elon Musk Mother: 74 ఏళ్ల వయస్సులో స్విమ్ సూట్ లో అందాలు ఆరబోసిన ఎలాన్ మస్క్ తల్లి.!!

elon musk mother

elon musk mother

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ కోసం పోజులిచ్చిన అత్యంత వృద్ధ మహిళగా చరిత్రకెక్కారు. మాయే మస్క్ తన స్విమ్ సూట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సంచలన సృష్టించారు. “74 ఏళ్ల వయస్సున్న మాయే మస్క్ తాను స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. మాయే మస్క్ వన్-పీస్ మెగెల్ కరోనల్ సూట్ ధరించి కనిపించింది.

74 ఏళ్ల మాయే మస్క్ కెనడియన్-సౌతాఫ్రికా డైటీషియన్ గా పేరు పొందారు ఆమో ఓ మోడల్. 50 ఏళ్లుగా ఆమె మోడలింగ్ వృత్తిలో ఉన్నారు. 21 సంవత్సరాల వయస్సులోనే మిస్ సౌత్ ఆఫ్రికా రన్నరప్‌ గా నిలిచారు. తల్లి అంటే ఎలాన్ కు చాలా ఇష్టం, మాయే సైతం మస్క్ చేసే ట్వీట్లకు జవాబు ఇస్తూ అప్పడప్పుడు కనిపిస్తుంది. తన కొడుకు వ్యాపారాల గురించి గర్వంగా షేర్ చేస్తుంటుంది. తన కొడుకును విమర్శించే వారిపై కూడా ఆమె విరుచుకుపడుతుంది.

ఇటీవల, ఎలాన్ మస్క్ తాను అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఎలా ఉంటుంది అంటూ ఓ ట్వీట్ చేశాడు. అందుకు మాయే చాలా సీరియస్ గా అది మంచి జోక్ కాదు అంటూ ట్వీట్ చేసింది. దీనిపై ఎలాన్ సారీ చెబుతూ తన ప్రేమను చాటారు.

ఇటీవల మదర్స్ డే సందర్భంగా …ప్రపంచంలో అత్యంత ధనికుడైన మీ కొడుకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా మాయే ను అడగగా, ఆమె సమాధానమిస్తూ, ‘మంచి బహుమతి అంటే నా దృష్టిలో ఆత్మీయ ఆలింగనం అని. నేను వాటిని నా మనవళ్లు, నా పిల్లలకూ ఇస్తాను. అంతకుమించిన గిఫ్ట్ ఇంకేమైనా ఉంటుందా’ అని మాయె మురిసిపోయారు.

 

Exit mobile version