Twitter: వామ్మో.. ట్విట్టర్ నుండి అంతమందిని తొలగించబోతున్నారా?

Twitter:  ప్రపంచ కుబేరుడు, ఎన్నో సంచనాలకు మూల బిందువుగా నిలిచిన వ్యక్తి ఎలాన్ మస్క్. చిన్నప్పటి నుండే వ్యాపారం చేస్తూ లాభాలు గుడుస్తూ.. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ మారాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:13 PM IST

Twitter:  ప్రపంచ కుబేరుడు, ఎన్నో సంచనాలకు మూల బిందువుగా నిలిచిన వ్యక్తి ఎలాన్ మస్క్. చిన్నప్పటి నుండే వ్యాపారం చేస్తూ లాభాలు గుడుస్తూ.. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ మారాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలను కలిగిన ఎలాన్ మస్క్.. నాటకీయ పరిణామాల మధ్య ట్విట్టర్ ని సొంతం చేసుకోవడం తెలిసిందే.

ట్విట్టర్ లో స్వేచ్ఛా వాతావరణం లేదని చెప్పిన ఎలాన్ మస్క్.. దానిని కొనుగోలు చేసి, స్వేచ్ఛాయుతం చేయబోతున్నట్లు ప్రకటించాడు. అనుకున్నట్లుగానే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. అయితే భారీ మొత్తానికి ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. భారీగా ఉద్యోగులను తొలగిస్తూ షాకిచ్చాడు.

తాజాగా అందుతున్న రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ కంటెంట్ మోడరేషన్ లో పని చేస్తున్న వారితో సహా మొత్తం 25 శాతం మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మొత్తం తొలగింపుల్లో ప్రముఖ న్యాయవాది అలెక్స్ స్పిరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరో నేతృత్వంలోని టీంలు ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తాయని సమాచారం.

ట్విట్టర్ లో ప్రస్తుతం పని చేస్తున్న దాదాపు అన్ని డిపార్ట్ మెంట్లలో ఉద్యోగుల తొలగింపు ఉండబోతోందని తెలుస్తోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం ఉన్న సేల్స్, ప్రొడక్ట్, ఇంజినీరింగ్, లీగల్ మరియు సెక్యూరిటీ డిపార్ట్ మెంట్లలోని ఉద్యోగులను రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.