Site icon HashtagU Telugu

Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

Visa

Visa

Visa: అమెరికాలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతర్జాతీయ, జాతీయ కంపెనీలన్నీ ఒక్కొక్కటింగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్ధిరపడిన వారికి భయం పట్టుకుంది. గంపెడు ఆశలు పెట్టుకొని వచ్చి ఇన్నేళ్లుగా ఇక్కడ ఉద్యోగాలు చేసి ఎక్కడి వెళ్లాలని మదన పడుతున్నారు. ఇలాంటి వారికే ఓ చక్కటి అవకాశాన్ని యూఎస్ కలిపించింది.

ట్రావెల్, బిజినెస్ వీసాలతో తమ దేశానికి వచ్చే వ్యక్తులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. అయితే ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. బిజినెస్ పనుల కోసం వచ్చేవారికి బీ1 వీసా, పర్యాటకులను బీ2 వీసాను అమెరికా జారీ చేస్తుంటుంది.

టెక్ దిగ్గజాలు ఇటీవల భారీగా ఉద్యోగాల్లో కోత విధించడం వల్ల వేలాది మంది విదేశీయులు కొలువులకు దూరమవుతున్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలోగా ఉద్యోగం లభిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సిందే.

Exit mobile version