Site icon HashtagU Telugu

Viral Video: ఏనుగును కాపాడిన అమ్మాయి.. ఏనుగు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్?

Viral Video

Viral Video

సాధారణంగా ఏనుగులు మనుషుల జోలికి కానీ ఇతర జంతువుల జోలికి కానీ వెళ్ళవు. కానీ మనుషుల వల్ల లేదా ఇతర జంతువుల వల్ల వాటికి హాని కలుగుతుంది అని తెలిస్తే మాత్రం వాటిని వెంటాడి మరి అవి చంపేస్తూ ఉంటాయి. ఏనుగు చేతికి ఒక్కసారి దొరికాము అంటే చాలు ఇంకా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కొన్ని టన్నుల బరువు ఉండే ఆ ఏనుగు ఒక్కసారి తొక్కింది అంటే చాలు పాతాళానికి వెళ్ళిపోతాము. అయితే కొంతమంది ఏనుగులతో మంచిగా ఉంటూ వాటికి ఇష్టమైన ఆహారం అనిపిస్తూ వాటి పట్ల ప్రేమగా ప్రవర్తిస్తూ ఉంటారు.

అయితే ఏనుగులు భారీ కాయంతో ఎక్కువ బరువు ఉండటం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో అవి అనుకోకుండా కొన్ని పెద్ద గుంతల్లోకి పడిపోతూ ఉంటాయి. ఇప్పటికే అలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఎన్నో ఏనుగులు నీటి గుంతల్లో బావులలో పడిపోగా వాటిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇక్కడ ఏనుగు కి హెల్ప్ చేసింది మాత్రం కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే. అదెలా అనుకుంటున్నారా..

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక ఏనుగు చెరుకు పొలానికి రోడ్డుకి మధ్య ఉన్న బురదలో ఏనుగు కాళ్ళు చిక్కుకున్నాయి. ఆ ఏనుగు కాళ్ళు చిక్కుకోవడంతో ఆ బురదలో నుంచి బయటికి రావడానికి అది నానా అవస్థలు పడుతోంది. అది చూసిన ఒక అమ్మాయి ధైర్యంగా ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి ఆ ఏనుగు కాళ్ళను బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ఏనుగు కాళ్లు బయటకు తీసి అంత బలం, అంత ధైర్యం లేకపోయినప్పటికీ లోలోపల భయపడుతూనే ఆ అమ్మాయి తన మంచి మనసుతో ప్రాణాలకు తెగించి మరీ ఆ గజరాజు కి సహాయం చేసింది. ఎట్టకేలకు ఆ ఏనుగును ఆమె ఆ బురద నుంచి తప్పించగలిగింది. అయితే కృతజ్ఞతలో ఆ ఏనుగు తన తొండంతో ఆమెను ఆశీర్వదించింది. ఈ వీడియోని చూసిన ని నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ అమ్మాయి ప్రశంసలు కురిపిస్తున్నారు..