Site icon HashtagU Telugu

Electrocution Killed 15 : డ్యామ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ పేలుడు.. 15 మంది మృతి

Electrocution Killed 15

Electrocution Killed 15

Electrocution Killed 15 : ట్రాన్స్ ఫార్మర్ పేలి 15 మంది మృత్యువాత పడ్డారు.

ఈ దారుణ  ప్రమాద ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.

చమోలి జిల్లా అలకనంద నది సమీపంలోని చమోలి డ్యామ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ అకస్మాత్తుగా పేలిపోయింది.

ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా..  మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతిచెందిన వారిలో పీపల్ కోట్ ఔట్ పోస్టు ఇన్ చార్జితో పాటు ముగ్గురు హోం గార్డులు, ఒక పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ఉన్నారు.

ఈవివరాలను ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. 

Also read : మోడీ పక్కన పవన్..జనసేన కు రానున్నవన్నీ మంచి రోజులైనా…?