Site icon HashtagU Telugu

AP Power Charges : గ‌ణేష్ మండ‌పాల‌కు విద్యుత్ శాఖ‌ షాక్‌… లోడ్‌ని బ‌ట్టి..?

Ganesh

Ganesh

గ‌ణేష్ మండపాలకు ఏపీ విద్యుత్శాఖ షాకిచ్చింది. విద్యుత్ లోడ్కు అనుగుణంగా అడ్వాన్స్ సీసీ ఛార్జ్ చెల్లించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. లోడ్ను అనుసరించి పలు ప్రాంతాల్లో టారిఫ్లు విధించాలని అధికారులు భావిస్తున్నారు. 500 వాల్ట్స్కు రూ.1,000, వెయ్యి వాల్ట్స్కు రూ.2,250 వసూలు చేయనున్నారు. 15 వందల వాట్స్కు రూ.3వేలు, 2 వేల వాట్స్కు రూ.3,750 వసూలు చేయనున్నారు. 2,500 వాట్స్కు రూ.4,500లు, 3వేల వాట్స్కు రూ.5,250లు 3,500 వాట్స్కు రూ.6వేలు, 4వేల వాట్స్కు రూ.6,750 రూపాయలు వసూలు చేస్తారు. 5వేల వాట్స్కు రూ.8,250లు, 6వేల వాట్స్కు రూ.9,750లు 10 వేల వాట్స్కు రూ.15,750 వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.100 దరఖాస్తు ఫీజ్, సర్వీస్ ఛార్జ్ రూ.45 అదనంగా చెల్లించాలని గణనాథుని మండపాల నిర్వహకులకు సూచించారు.