Site icon HashtagU Telugu

Train Derails At Avadi: తప్పిన పెను ప్రమాదం.. చెన్నైలో పట్టాలు తప్పిన రైలు

Train Derails At Avadi

Compressjpeg.online 1280x720 Image 11zon

Train Derails At Avadi: చెన్నైలోని అవడి రైల్వే స్టేషన్‌లో పెను రైలు ప్రమాదం తప్పింది. అవడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈఎంయూ రైలు మూడు కోచ్‌లు పట్టాలు (Train Derails At Avadi) తప్పాయి. అయితే కోచ్‌లు పట్టాలు తప్పిన సమయంలో కోచ్‌లో ప్రయాణికులెవరూ లేరు.

మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి

మంగళవారం ఉదయం అవడి రైల్వే స్టేషన్‌లో ఈఎంయూ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ రైల్వే పీఆర్వోను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI తెలిపింది. కార్‌ షెడ్‌ నుంచి మెయిన్‌లైన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

రైలు కోచ్‌లలో ప్రయాణికులు లేరు

మంగళవారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ)కి చెందిన మూడు ఖాళీ కోచ్‌లు పట్టాలు తప్పాయని దక్షిణ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, వివిధ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయని తెలిపారు. ఇండియా టుడే ప్రకారం.. రైలు అన్నూర్ షెడ్ నుండి బయలుదేరి బీచ్ స్టేషన్ వైపు వెళుతుండగా అవడికి చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రైలు అవడి స్టేషన్‌లో ఆగలేదని, హిందూ కాలేజీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: Samsung Galaxy S24 : శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్24’ ఫీచర్స్ అదుర్స్.. లాంఛ్ డేట్ అదే !

ప్రమాదం కారణంగా రైళ్లలో జాప్యం

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని దక్షిణ రైల్వే తెలిపింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.