Scooter Sales : వామ్మో.. ఏడాదికీ అన్ని స్కూటర్ లు అమ్ముడవుతున్నాయా?

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో వాహన వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. తద్వారా

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 10:00 AM IST

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో వాహన వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. తద్వారా రోడ్డుపై ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతోంది. ప్రతి ఏడాది కొన్ని లక్షల్లో ద్విచక్ర వాహనాలు కొనుగోలు అవుతున్నాయి. దీంతో మనకు రోడ్డుపై ఎక్కడ చూసినా మనకు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేకపోతే ఏడాది ఏప్రిల్ – జులై నెలలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మరోవైపు మోటార్‌ సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమం అయ్యింది.

అయితే భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు ఏ రేంజ్ లో దూసుకెళ్తున్నాయో ఈ గణాంకాలే చక్కటి నిదర్శనం. కాగా స్కూటర్ లు తక్కువ బరువు, అలాగే సులభంగా నడపడానికి వీలుండడంతో వినియోగ దారులు కూడా ఎక్కువగా వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పెద్ద పెద్ద నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌ లో ఈ గేర్‌లెస్‌ వాహనాలే నయం అన్న భావనతో ప్రజలు ఎక్కువగా ఈ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్కూటర్ల తయారీ సంస్థ కంపెనీలు స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తూ అద్భుతమైన ఫీచర్లతో స్కూటర్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. పెట్రోల్ తో నడిచే స్కూటర్లు మాత్రమే కాకుండా బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి.

కాగా మోటారు సైకిళ్ల కంటే స్కూటర్ల అమ్మకాల శాతం ఎక్కువగా నమోదవుతోంది. ఇకపోతే ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో హోండా మోటార్‌ సైకిల్స్, స్కూటర్స్‌ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. మార్కెట్ లో క్రమంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్‌ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్‌ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ టూవీలర్లు విక్రయం అయ్యాయి.