Site icon HashtagU Telugu

BRS Minister: మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

BRS Minister: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలు కావడంతో ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుండి సిరిసిల్ల కు వెళ్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి వాహనాన్ని కొదురుపాక వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రితో పాటు వాహనంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కే. కేశవరావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. వీరు ఎన్నికల అధికారుల తనిఖీలకు సంపూర్ణంగా సహకరించారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా ఆదివారం వరకు వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడింది.

తనిఖీలు ప్రారంభించిన నాటి నుంచి 14వ తేదీ రాత్రి వరకు సుమారు రూ.48,32,99,968 నగదు దొరికింది. పోలీసు, రవాణాశాఖ, కమర్షియల్‌ టాక్స్‌, ఎక్సైజ్‌, అటవీశాఖల చెక్‌పోస్టుల వద్ద తనిఖీల ద్వారా రూ.17,50,02,116 విలువైన వజ్రాలు, బంగారు, వెండి నగలు, ఇతర ఆభరణాలు పట్టుబడటం విశేషం.

Also Read: Prabhas: ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందా.. అయోమయంలో ఫ్యాన్స్