Site icon HashtagU Telugu

Punjab Icon: సోనూ సూద్ నియామకం రద్దు- ఎన్నికల సంఘం

Template (52) Copy

Template (52) Copy

ప్రముఖ నటుడు సోనూ సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ప్రజాస్వామ్యం పై ప్రజల్లో చైతన్యం కలిగించి ఎన్నికల్లో పాల్గొనేలా చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబరులో సోనూ సూద్ ను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం నియమించడం తెలిసిందే. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. ఈ నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

అయితే, సోనూ సూద్ సోదరి మాళవిక సచేర్ (39) రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాళవిక పంజాబ్ లోని మోగా నియోజకవర్గం బరిలో దిగాలని భావిస్తున్నారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న అంశం తెలియరాలేదు.

Exit mobile version