Site icon HashtagU Telugu

Crime: హైదరాబాద్‌లో వృద్ధురాలు దారుణ హ‌త్య!

Crime

పేట్ బ‌హీర్‌బాద్‌లో ఓ వృద్ధురాలు దారుణ హ‌త్య‌కు గురైంది. టి.సుజాత(72) ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఆమె ముగ్గురు పిల్లలు నగరంలోని వివిధ ప్రాంతాలల, విదేశాలలో వారి కుటుంబాలతో ఉంటారు. మంగళవారం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా, వారు వెళ్లి పరిశీలించారు. తలుపు బయట నుండి లాక్ చేసి ఉంది.. కానీ ఇంటి లోపల నుండి దుర్వాసన వెలువడుతున్నట్లు గ్రహించారు. ఇరుగుపొరుగు వారు ఆమె కుటుంబాన్ని, పోలీసులను అప్రమత్తం చేయ‌గా.. పోలీసులు త‌లుపులు ప‌గ‌ల‌కొట్టి లోప‌లికి వెళ్లారు. ఇంట్లో ఆమె చనిపోయి, కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Exit mobile version