Site icon HashtagU Telugu

Greenman Accident: వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!

Greenman

Greenman

కోటి మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య బుధవారం ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన 85 ఏళ్ల వృద్ధుడు మొక్కలకు నీరు పెట్టేందుకు సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని కాలుకు ఫ్రాక్చర్ కావడంతో పాటు తలపై గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎంపీ సంతోష్ కుమార్ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. వన జీవి రామయ్యగా పేరొందిన ఈయన 2017లో పద్మశ్రీని అందుకున్నాడు. పర్యావరణం పట్ల రామయ్య కు ఉన్న శ్రద్ధ అత్యున్నత పురస్కారం అందేలా చేసింది. ఐదు దశాబ్దాల్లో కోటి కిపైగా మొక్కలు నాటి నేచర్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.