Maharashtra : శివసేన రెబల్స్‌తో కలిసి ముంబైకి చేరుకున్న సీఎం ఏక్‌నాథ్ షిండే

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 10:16 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గోవా నుండి ముంబై చేరుకున్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు” పాల్పడినందుకు పార్టీ నుండి బహిష్కరించారు. శివసేన పార్టీ అధ్యక్షుడిగా త‌న‌కు లభించిన అధికారాలను ఉపయోగించి, పార్టీలో శివసేన నాయకుడి పదవి నుండి త‌న‌ను మిమ్మల్ని తొలగిస్తున్నానని థాకరే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు లేఖ రాశారు
నిన్న ప్రజలను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగంలో, థాకరే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2.5 సంవత్సరాలుగా శివ‌సేన నాయకుడిని సిఎం చేసే అసలు ఒప్పందానికి కట్టుబడి ఉంటే.. ఈ రోజు బిజెపి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. 2.5 సంవత్సరాలు (శివసేన-బిజెపి పొత్తు సమయంలో) శివసేన ముఖ్యమంత్రిగా ఉండాలని తాను అమిత్ షాకు ముందే చెప్పానని.. వారు ఇంతకు ముందే ఒప్పుకుని ఉంటే మహా వికాస్ అఘాదీ ఉండేది కాదని థాక‌రే చెప్పారు.

ఇదిలా ఉండగా ఆదివారం జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌ను స్పీకర్‌గా ఎన్నుకునేలా బీజేపీ సిద్ధమవుతోంది. విశ్వాస ఓటుకు ముందు షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శివసేన గ్రూపుకు అధికారిక గుర్తింపు లభించింది. మరోవైపు మహా వికాస్ అఘాడీ శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీని రంగంలోకి దింపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జూలై 3, 4 తేదీల్లో జరగనున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన మెజారిటీని హౌస్ ఫ్లోర్‌లో నిరూపించుకోవాలని సిఎం షిండేని కోరారు.