Site icon HashtagU Telugu

King Charles : కింగ్ చార్లెస్‌పై గుడ్లు విసిరిన దుండ‌గులు.. ఒక‌రు అరెస్ట్‌

King Charles

King Charles

లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండ‌గులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుడ్లు విసురుతున్నప్పుడు అదుపులోకి తీసుకున్న వ్యక్తి “ఈ దేశం బానిసల రక్తంతో నిర్మించబడింది” అని గ‌ట్టిగా అరిచాడు. అయితే అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు మాత్రం “గాడ్ సేవ్ ది కింగ్” అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. చార్లెస్ ఈ గందరగోళం వల్ల ప్రభావితం కాలేదు. గుడ్లు ప‌డిన ప్రాంతంలోనే న‌డుచుకుంటూ ముంద‌కుసాగారు. చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ II విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చార్లెస్, కెమిల్లా యార్క్ నగరానికి చేరుకున్నారు.