Watch Video: గుడ్ల డీసీఎం బోల్తా.. ఎత్తుకెళ్లిన జనం!

ప్రతిచోటా ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరగడం సర్వ సాధారణమే.

Published By: HashtagU Telugu Desk
Eggs

Eggs

ప్రతిచోటా ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరగడం సర్వ సాధారణమే. ప్రమాదాన్ని పసిగొట్టి కొందరు పోలీసులకు సమాచారం ఇస్తే, మరికొందరి ప్రయాణికులు, పాదచారులు ఆశ్చర్యకర సంఘటనలకు పాల్పడుతుంటారు. ఇటీవల ఓ కూల్ డ్రింక్స్ లో లారీ బోల్తా పడగా, విషయం గ్రామస్తులు క్షణాల్లో లోడును ఖాళీ చేశారు. తాజాగా అలాంటి ఘటననే జరిగింది. తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్​ వద్ద శుక్రవారం అర్ధరాత్రి.. డీసీఎం- సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కోడిగుడ్లను తరలిస్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ క్రమంలో వెనకే వస్తున్న మరో రెండు వాహనాలు ఢీకొన్నాయి.

ప్రమాదంలో డీసీఎం డ్రైవర్​ తీవ్రంగా గాయపడగా.. అందులో ఉన్న కోడిగుడ్లు నేలపాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు.. ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్​కు సమాచారం అందించి ఆసుపత్రిలో చేర్చారు. అయితే పనుల నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన స్థానికులు.. రోడ్డుపై కోడిగుడ్ల వాహనం బోల్తా పడి ఉండటం చూశారు. అంతే ఒక్కసారిగా లోడ్ ఖాళీ చేసే పనిలో పడ్డారు. వారి వారి కుటుంబీకులకు సమాచారం అందించి అందినకాడికి ట్రేలలో గుడ్లను నింపుకెళ్లారు. బకెట్లలో, జగ్గుల్లో గుడ్లను నింపుకెళ్లారు. చూస్తుండగానే గుడ్లను ఖాళీ చేశారు.

  Last Updated: 23 Apr 2022, 05:30 PM IST