మనిషి జీవితం (Life) నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మన ముందే కళ్ల ముందు తిరుగాడే వ్యక్తి సడన్ గా కుప్పకూలిపోవచ్చు. అత్యవసర పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తి ఏదో ప్రమాదం (Accident) బారిన పడి చనిపోవచ్చు. పెద్ద పెద్ద ప్రమాదాలే కాదు.. ఒక్కోసారి చిన్న ప్రమాదాలు సైతం మనిషి ప్రాణాలు తీయొచ్చు. రోజు తినే గుడ్డే (Egg) మనిషి ప్రాణం తీసింది అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
అంజీ అనే మానసిక రోగి హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డాలో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. మెనూలో భాగంగా అతని ఆస్పత్రి సిబ్బంది గుడ్డు (Egg)ను పెట్టారు. అయితే ఆ వ్యక్తి గుడ్డు (Egg)ను తింటున్న క్రమంలో గొంతులో ఉరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Also Read: Cop Locks Women: మహిళను బంధించి, చితకబాదిన పోలీస్, వీడియో వైరల్!