BRS MLA: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి: కడియం శ్రీహరి

BRS MLA: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ,అంబెడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు. జఫ్ఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్నీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి […]

Published By: HashtagU Telugu Desk
Kadiyam Srihari

Kadiyam Srihari

BRS MLA: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ,అంబెడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు. జఫ్ఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్నీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషమన్నారు సమాజం లో దళిత జాతి తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది అంబెడ్కర్ కృషి వల్లనేనని, భారతదేశ ప్రజాలయొక్క సామాజిక ఆర్ధిక రాజకీయ స్థితి గతులను తీసుకొని రాజ్యాంగం ద్వారా న్యాయం జరగాలని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబెడ్కర్ అని కొనియాడారు.అనంతరం ఎమ్మెల్యే గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,అంబెడ్కర్ సంఘ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 15 Mar 2024, 05:37 PM IST