Site icon HashtagU Telugu

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీకేజీ నిందితుల్ని ప్రశ్నిస్తున్న ఈడీ…

TSPSC Paper Leak Case

New Web Story Copy (3)

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీకేజి కేసులో ఈడీ ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఈడీ ఆరోపిస్తుంది. ఈ నేపధ్యంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించి నిందితులని విచారించేందుకు అనుమతి కోరింది. కాగా ఈడీ అభ్యర్థనకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. నాంపల్లి కోర్టు 2 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. నిందితులను ఈ నెల 17, 18న చంచల్‌గూడ జైలులో ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించనున్నారు. పేపర్ లీకేజి కేసులో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు విచారించనున్నారు.

చంచల్ గూడ సెంట్రల్ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లను నిందితుల తరుపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి సూచించింది కోర్టు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుల్ని ఈడీ ప్రశ్నించనుంది. అయితే ఈడీ వెంట పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్, మొబైల్ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా ఈడీకి అన్ని విధాలుగా సహకరించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ చంచల్ గూడ సెంట్రల్ జైలు సూపర్ డెంట్ కు కోర్టు ఆదేశాలు జరీ చేసింది.

తెలంగాణాలో సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసుని సిట్ కి అప్పజెప్పింది. అయితే విపక్షాలు మాత్రం పేపర్ లేక్ చేసింది అధికార పార్టీ అంటూ ఆరోపణలు చేసింది. దీని వెనుక అధికార పార్టీ పెద్దలు ఉన్నారని, లక్షల్లో డబ్బు చేతులు మారాయని ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తూ.. కోర్టుని ఆశ్రయించి నిందితుల్ని విచారించేందుకు అనుమతి కోరింది. ఓ వైపు సిట్, మరోవైపు ఈడీ ఎంటర్ అవ్వడంతో ఈ కేసుపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.

Exit mobile version