Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఈ క్రమంలో మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నవంబర్ 2న విచారణకు పిలిచింది.
నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోరినట్లు సమాచారం.ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన రోజే కేజ్రీవాల్ కి సమన్లు రావడం గమనార్హం. గతేడాది ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈ నెల ప్రారంభంలో ఈడీ అరెస్ట్ చేసింది.
Also Read: 7 Things Men Do When They Cheat In a Relationship : భాగస్వామి మోసం చేస్తున్నాడని తెలిపే 7 విషయాలు..!