ED Raids On Hero Motocorp : దేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ చీఫ్ ఇంట్లో ఈడీ రైడ్స్  

ED Raids On Hero Motocorp : దేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  ఇవాళ  సోదాలు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ed Raids On hero Motocorp

Ed Raids On hero Motocorp

ED Raids On Hero Motocorp : దేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  ఇవాళ  సోదాలు చేసింది.

మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించిన విచారణలో భాగంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో పాటు మరికొందరిపై  ఈడీ దాడులు నిర్వహించినట్లు పీటీఐ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ముంజాల్‌కు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి దగ్గర అక్రమ విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)కు  ఫిర్యాదులు అందాయి.  దీనికి సంబంధించిన దర్యాప్తులో భాగంగానే  పవన్‌ ముంజాల్‌ నివాసంలో ఈడీ సోదాలు చేసిందని అంటున్నారు. 

Also read : Australia: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో..12 ఏళ్లకు రిటైర్మెంట్.. చిన్న వయసులోనే అరుదైన ఘనత?

ED అధికారులు పవన్ ముంజాల్ తో పాటు  మనీలాండరింగ్ ఆరోపణలతో సంబంధం కలిగి ఉన్నారనే అభియోగాలను  ఎదుర్కొంటున్న మరో 10 మంది ఇళ్లపై కూడా ఇవాళ ఉదయం ఏకకాలంలో రైడ్స్ చేశారని తెలిసింది.  ఈడీ రైడ్స్ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ కంపెనీ షేరు ధర ఇవాళ  4 శాతానికి పైగా పడిపోయి రూ.3,066కు చేరింది. హీరో మోటో కార్ప్ టూ వీలర్స్ విక్రయాల పరంగా 2001లో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. గత 20 వరుస సంవత్సరాలుగా ఈ టైటిల్‌ హీరో మోటో కార్ప్(ED Raids On Hero Motocorp) చేతిలోనే ఉంది. ఈ కంపెనీ టూ వీలర్స్  ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలలోని 40 దేశాలలో కూడా సేల్ అవుతుంటాయి.

  Last Updated: 01 Aug 2023, 03:32 PM IST