Site icon HashtagU Telugu

ED-IT Raids: దేశంలో ఈడీ,ఐటీ దూకుడు… పలు రాష్ట్రాల్లో సోదాలు

Tollywood

It Raids

ED-IT Raids: దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు సంబంధిత అధికారులు. బుధవారం తెలంగాణలోని ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేసి అధిక డబ్బుకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అంతేకాకుండా లావాదేవీల్లోనూ అనేక అవకతవకలు జరిగినట్టు సమాచారం మేరకు అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణతో పాటు బీహార్ లోనూ దర్యాప్తు సంస్థల దాడులు జరిగాయి. ఈ రోజు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి విజయ్ చౌదరి బావమరిది ఇంటిపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించాయి. 7 వాహనాల్లో వచ్చిన దర్యాప్తు సంస్థ అధికారులు బెగుసరాయ్‌లోని శ్రీకృష్ణ నగర్‌లోని అజయ్‌కుమార్‌ సింగ్‌ అలియాస్‌ కరూ సింగ్‌ నివాసంలో దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. అజయ్ సింగ్‌కు ఇనుము ఫ్యాక్టరీతో సహా డజనుకు పైగా పరిశ్రమలు ఉన్నాయి.

మరోవైపు ఢిల్లీ, ఎన్‌సీఆర్, కాన్పూర్, లక్నో, కోల్‌కతా సహా పలు రాష్ట్రాలు మరియు జిల్లాల్లో నగల వ్యాపారులపై ఐటీ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.

Read More: NEET UG Counselling: త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ.. కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..!